వితంతు, ఒంటరి ముస్లిం మహిళలకు వక్ఫ్ బోర్డు భూముల్లో వసతి గృహాలు నిర్మించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఇఫ్తార్ విందుకు ఖర్చు చేసే నగదును అనాథ శరణాలయాలకు ఇవ్వాలని కోరారు. మైనారిటీలకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. మైనారిటీ సంక్షేమ శాఖలో 235 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారిలో చాలా మంది ఒప్పంద ఉద్యోగులే ఉన్నారు. విజయా బ్యాంకులో మైనారిటీ శాఖకు సంబంధించి సుమారు రూ.59 కోట్లు ఉన్నాయి. ఆ నగదును విడిపించాలి.
-అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభ పక్షనేత
- ఇదీ చూడండి : 'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'