ETV Bharat / state

'భగీరథ జలం సురక్షితం'

మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీరు పూర్తి సురక్షితమని... రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలను పాటిస్తూ నీటి శుద్ధి చేపడుతున్నట్లు మిషన్​ భగీరథ శాఖ పేర్కొంది.

'భగీరథ జలం సురక్షితం'
'భగీరథ జలం సురక్షితం'
author img

By

Published : Sep 29, 2020, 2:15 PM IST

మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమైనదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నీటిని మూడు దశల్లో శుద్ధి చేస్తున్నామని పేర్కొంది. నీటిశుద్ధి కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాల్లో నిపుణులైన కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు గంటకోసారి నీటి నాణ్యతను పరీక్షించి... దాదాపు 15 రకాల పరీక్షలు నిర్వహిస్తామని మిషన్ భగీరథ శాఖ పేర్కొంది.

ఏరియేటర్ ద్వారా వచ్చిన నీటికి క్లారిప్లొకేటర్​లో ఆలంపటిక కలపడం వల్ల చెత్తా చెదారం, బురద శుద్ధి అవుతాయని... ఆ తర్వాతి దశలో ఫిల్టర్ బెడ్​లో సహజపద్ధతిలో రసాయనాలు కలపకుండానే సురక్షిత మంచినీరు అందుతుందని వివరించింది.

ఇదీ చూడండి: వానలు సమృద్ధిగా కురిసినా.. వేసవి వస్తే దాహం కేకలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.