ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దేశంలోని తాగునీటి సరాఫరా పథకాలు, వాటి పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరులోని ఇంటేవెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని వాస్తవ పరిస్థితిని కేంద్రబృందం తెలుసుకుంటుంది. ఎల్లుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను సందర్శిస్తుంది. సిద్దిపేటలోనూ పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం హైదరాబాద్‌లో మిషన్ భగీరథ అధికారులతో కేంద్ర బృందం సమావేశమై పథకానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తుంది.
మిషన్‌భగీరథను పరిశీలించనున్న కేంద్ర బృందం - MISSION BHAGIRADHA
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ ప్రాజెక్టును కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లో మూడు రోజుల పాటు పర్యటించనుంది.
ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దేశంలోని తాగునీటి సరాఫరా పథకాలు, వాటి పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రేపు నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరులోని ఇంటేవెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాల్లోని వాస్తవ పరిస్థితిని కేంద్రబృందం తెలుసుకుంటుంది. ఎల్లుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను సందర్శిస్తుంది. సిద్దిపేటలోనూ పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం హైదరాబాద్‌లో మిషన్ భగీరథ అధికారులతో కేంద్ర బృందం సమావేశమై పథకానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తుంది.
TAGGED:
MISSION BHAGIRADHA