మిషన్ భగీరథ ఇంజినీర్లకు వర్క్‌షాప్‌లు చాల ఉపయోగపడుతాయని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి వెల్లడించారు. ఇంజినీర్లకు టెక్నాలజీ తెలుసు కానీ జ్యూడిషియల్ వ్యవస్థ గురించి తెలియదని పేర్కొన్నారు. కాబట్టి ఈ వర్క్‌షాప్‌లు దోహదపడుతాయన్నారు. ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసోల్యూషన్ ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ను నిర్వహించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏమైనా వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థలో రోజు రోజుకూ వచ్చే మార్పులు లీగల్ ఇష్యూలు ఏమైనా ఉంటే వివాదాలు పరిష్కారించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్ఛార్జీ కార్యదర్శి జేఎల్ఎన్ మూర్తి, చీఫ్ ఇంజినీర్ వినోభా దేవితోపాటు పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఇవీచూడండి: తగ్గుముఖం... శాంతిస్తున్న కృష్ణమ్మ