ETV Bharat / state

ఇళ్లకే కాదు పరిశ్రమలకూ భగీరథ నీళ్లు..!

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లానీరు... పదుల సంఖ్యలో ఇన్​టేక్ వెల్స్, వందల్లో శుద్ధికేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అందుకు అనుగుణంగా విద్యుత్ కేంద్రాలు, వేలాది ఓవర్ హెడ్ ట్యాంకులు, లక్ష కిలోమీటర్లకుపైగా పైపు లైన్లు... ఇదీ మిషన్ భగీరథ స్వరూపం. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో మొత్తం 65 లక్షల ఇండ్లకు నల్లానీరు అందించేందుకు రూ. 43వేల కోట్ల భారీ వ్యయంతో తాగు, సాగునీటి రూపురేఖల్ని మారుస్తూ ఈ పథకం రూపుదిద్దుకొంది.

mission bhageeratha water supplies to the industries
ఇళ్లకే కాదు పరిశ్రమలకూ భగీరథ నీళ్లు..!
author img

By

Published : Aug 23, 2020, 12:26 PM IST

ఇంటింటికీ నల్లానీరు అందించేలా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు వ్యయం రూ. 43వేల కోట్ల పైగానే. రూ. 43,791కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అందుకు అనుగుణంగా పనులు జరిగాయి. మొత్తం మిషన్ భగీరథ ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించారు. సెగ్మెంట్ల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేశారు.

గ్రావిటీతో ఎత్తిపోతలు..

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు, జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 19 చోట్ల భారీ ఇన్ టేక్​వెల్స్​ నిర్మించారు. 50 నీటి శుద్ధికేంద్రాలతో పాటు 1163 సర్వీస్ రిజర్వాయర్లను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ నల్లానీరు అందించేందుకు మొత్తం లక్షా 69వేల కిలోమీటర్ల పైపు లైన్ అవసరం. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పైప్ లైన్లను మినహాయించి కొత్తగా లక్షా 15వేల కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు. 98శాతం నీరు గ్రావిటీ ద్వారానే సరఫరా అయ్యేలా మిషన్ భగరీథ పథకాన్ని రూపొందించారు.

నిర్వహణ గుత్తేదారులదే..

మిషన్ భగీరథకు అవసరమయ్యే రూ. 43వేల కోట్ల వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకొంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి రుణాల రూపంలో నిధులు సమీకరించుకొంది. ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి.. హడ్కో, నాబార్డు లాంటి సంస్థలతో పాటు వాణిజ్యబ్యాంకుల నుంచి రుణాల ద్వారా నిధులు ఏర్పాటుచేసుకుంది. మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో.. డీపీఆర్ తయారీ, పరిశీలన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్కోస్​తో పూర్తి చేయించింది. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వహణను కూడా గుత్తేదారే చూసేలా ప్రభుత్వం షరతులు విధించింది. పదేళ్లపాటు నిర్వహణ, మరమ్మత్తులను కూడా గుత్తేదారుకే అప్పగించారు. మిషన్ భగీరథ పైపులతో పాటే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లనూ వేశారు.

త్వరలో పరిశ్రమలకు..

భగీరథ ద్వారా శుద్ధి జలాలను బల్క్​గా పట్టణప్రాంత స్థానికసంస్థలకు, గ్రామపంచాయతీలకు సరఫరా చేస్తారు. నీటిశుద్ధి పరిశీలన కోసం నీటి నాణ్యతా పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. స్కాడా విధానం సహాయంతో నీటి పంపిణీ, సరఫరాలను పర్యవేక్షిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధిచేసిన మంచినీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీరు అవసరం ఉన్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని అదేశించింది. మిషన్ భగీరథకు కేటాయించిన 80టీఎంసీలలో పదిశాతం అంటే ఎనిమిది టీఎంసీలను పరిశ్రమలకు అందించనున్నారు.

ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్​ భగీరథ పథకం ఇప్పడు అనేక ప్రశంసలను అందుకుంటూ వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.