ETV Bharat / state

'గాంధీలో మిస్సయిన యువకుడు శవమై మార్చురీలో తేలాడు.!' - deadbody missing case in gandhi

మంగళహాట్​ పీఎస్ పరిధిలో నివసించే యువకుడు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరి తప్పిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. అతను చనిపోతే మృతదేహం మే31న రాత్రి 10 గంటల సమయంలో అనాథల మార్చరీకి చేర్చినట్లు రికార్డులో ఉందని మంగళహాట్ సీఐ రణ్వీర్ రెడ్డి తెలిపారు. మే 30 వ తేదీన కరోనా లక్షణాలతో ఉన్న నరేందర్​ సింగ్​ను గాంధీ హాస్పిటల్​లో చేర్పించినట్లు అతని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు.

missing-narendar-singh-dead-body-found-in-gandhi-hospital-mortuary
మే31వ తేదీనే ఆ డెడ్​బాడీ మార్చరీకి చేరింది: మంగళహాట్ సీఐ
author img

By

Published : Jun 21, 2020, 7:33 PM IST

మే31వ తేదీ నుంచి నరేంద్ర సింగ్ కనిపించడం లేదంటూ.. ఈ నెల 6వ తేదీన అతని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మంగళహాట్ సీఐ రణ్వీర్ రెడ్డి తెలిపారు. మే 30వ తేదీన కరోనా లక్షణాలతో ఉన్న నరేందర్​ సింగ్​ను కింగ్​కొఠి ఆస్పత్రి నుంచి గాంధీ హాస్పిటల్​లో చేర్పించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లామని కుటుంబ సభ్యులు వివరించారు. ఆ కోణంలో విచారణ జరపగా... కింగ్ కోఠి హాస్పిటల్ నుంచి నరేందర్​​తో పాటు మరో పేషేంట్​ను 108 వాహనంలో గాంధీకి తీసుకెళ్లి వైద్యులకు అప్పగించినట్లు 108 సిబ్బంది తెలిపారు.

'గాంధీలో పూర్తిగా వెతికాం.. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్​లను పరిశీలించాం అయిన ఫలితం లేదు. అనాథ మృతదేహాలను ఉంచే మార్చరీలో ఓ మృతదేహం ఉందన్న సమాచారంతో యువకుడి కుటుంబ సభ్యులతో వెళ్లి పరిశీలించారు. వాళ్లు నిర్ధారించినందున.... గాంధీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అతని మృతదేహాన్ని అప్పగించాం' అని సీఐ వెల్లడింటారు. ఆ డెడ్​బాడీని మే31వ తేదీన రాత్రి 10 గంటలకు అనాథల మార్చరీకి చేర్చినట్లు రికార్డులో ఉందని సీఐ తెలిపారు.

ఇదీ చూడండి: సడలింపులు ఇచ్చినప్పటికీ... కుదురుకోని హోటళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.