హైదరాబాద్ బేగంపేట రసూలుపురాకు చెందిన రెడ్డబోయిన కవిత ఆమె కుమారుడు కార్తీక్, కుమార్తె మానస కనిపించకుండా పోయారు. ఇంట్లో నుంచి తన కూతురు కొడుకును తీసుకుని కవిత బయటకు వెళ్లినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి పిల్లలను వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఎక్కడా వారి జాడ లభించలేదని తెలిపారు. కవిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎన్ని చట్టాలొచ్చినా ఆగని ఆడపిల్లల విక్రయాలు... భ్రూణ హత్యలు!