ETV Bharat / state

ఫేస్​బుక్ కలిపింది: అమ్మా కావాలి.. ఆ ప్రేమా కావాలి!

ఏళ్లుగా.. కన్నవారికి దూరంగా ఉన్న భవానీ కథ సుఖాంతమైంది. వారిని ఫేస్​బుక్​ కలిపింది. పేగుబంధంతోపాటు పెంచిన బంధం.. తనతోనే ఉండాలని భవానీ కోరుకుంటోంది.

missing-bhavani-story-end-happily
missing-bhavani-story-end-happily
author img

By

Published : Dec 8, 2019, 6:10 PM IST

ఫేస్​బుక్ ద్వారా తల్లిదండ్రులను కలిసిన భవానీ

విజయవాడ భవానీ కథ సుఖాంతమైంది. 15 ఏళ్ల కిందట హైదరాబాద్​లో అదృశ్యమైన భవానీ... ఫేస్​బుక్ ద్వారా కన్న తల్లిదండ్రులను ఇవాళే కలిసింది. చీపురుపల్లి నుంచి భవానీ.. రక్త సంబంధీకులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ పటమటలంకకు చెందిన జయమ్మ భవానీని కన్నకూతుళ్లతో సమానంగా పెంచింది. ఇరు కుటుంబాలతో పోలీసులు మాట్లాడి... ఆధారాలను పరిశీలించారు.

భవానీకి నచ్చిన వారి వద్ద ఉండొచ్చని పోలీసులు చెప్పారు. అయితే... భవానీని పెంచిన తల్లి జయమ్మ మాత్రం డీఎన్​ఏ పరీక్ష చేసి తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులను కోరుతోంది. కన్నతల్లితోపాటు పెంచిన అమ్మతో ఉంటానని భవానీ అంటోంది. రెండు కుటుంబాలు ఏమనుకుంటున్నాయో... మా ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్​ కలిపింది ఆ కుటుంబాన్ని..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.