ETV Bharat / state

telangana intermediate exams: మారిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్​.. ఎందుకంటే

intermediate latest news
intermediate latest news
author img

By

Published : Oct 8, 2021, 4:58 PM IST

Updated : Oct 8, 2021, 5:29 PM IST

16:57 October 08

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూలులో (telangana intermediate exams)స్వల్ప మార్పులు చేసుకున్నాయి. ఈమేరకు కొత్త తేదీలకు బోర్టు ప్రకటించింది. హుజూరాబాద్ ఉపఎన్నికల (huzurabad byelections)పోలింగ్‌తో పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ఇంటర్​ బోర్టు తెలిపింది. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలు..  ఈనెల 31, నవంబరు 1కి మార్చినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు. హుజూరాబాద్​లో ఈనెల 30న పోలింగ్​ జరగనుండగా..  నవంబర్​ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. 

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గతంలో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్‌ అయ్యారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్​కే పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఇదీచూడండి: TS Inter 1st year Exams: అక్టోబరు 25 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు

Last Updated : Oct 8, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.