ETV Bharat / state

జల వివాదంపై న్యాయసలహా కోరనున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ - జల వివాదంపై న్యాయసలహా కోరనున్న జలశక్తి

అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం జల వివాద అంశాన్ని రెండు రాష్ట్రాలకు పరిమితం చేయవచ్చా? లేక నాలుగు రాష్ట్రాలకా? అన్నదానిపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ న్యాయ సలహా కోరనున్నట్లు తెలిసింది.

andhra and telangana water dispute
జల వివాదంపై న్యాయసలహా కోరనున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ
author img

By

Published : Oct 9, 2020, 6:29 AM IST

ఇప్పటివరకు ఉన్న ట్రైబ్యునళ్లన్నీ బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటైనవే. మొదటి సారిగా బేసిన్‌లోని రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించడానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం లేదా ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌కే ఈ పని అప్పగించడం చేయాలి కాబట్టి న్యాయసలహా కీలకం కానుందని జల్‌శక్తి మంత్రిత్వశాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈనెల ఆరున జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో కేసీఆర్‌ దీని గురించి పట్టుబట్టడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకొంటే న్యాయసలహా తీసుకొని ముందుకెళ్తామని ప్రకటించారు. 2018లో తెలంగాణ రాసిన లేఖ ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంగా ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌కే బాధ్యత అప్పగించడానికి ఉన్న అవకాశాలపైనే ప్రధానంగా న్యాయ సలహా కోరనున్నట్లు తెలిసింది.

తెలంగాణ ఏర్పడ్డాక 2014 జులై 14న నీటి కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తమ వాదనలు వినిపించుకోవడానికి సెక్షన్‌-3 ప్రకారం అవకాశం కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-1, 2లో భాగస్వామ్య రాష్ట్రాల మధ్య అసమాన పంపిణీ జరిగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయసమ్మతంగా తెలంగాణకు రావలసిన నీటికోసం డిమాండ్‌ చేయలేదంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అప్పటికే ఉన్న వినియోగాన్ని సంరక్షించడానికి 1693.36 టీఎంసీలు కేటాయించిందని, ఇందులో తెలంగాణకు 248.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 500.17 టీఎంసీలు ఇచ్చిందని పేర్కొంది. మరో 366.64 టీఎంసీలను మూడు రాష్ట్రాల మధ్య పంచిందని, ఇందులో జూరాలకు 17.84 టీఎంసీలు మాత్రమే కేటాయించిందని పేర్కొంది. 33 టీఎంసీలను శ్రీశైలంలో ఆవిరికింద కేటాయించిందని, ఈ ట్రైబ్యునల్‌లోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంది.

కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 448 టీఎంసీలను పంచిందని, ఇందులో తొమ్మిది టీఎంసీలను మాత్రమే జూరాలకు ఇచ్చి బేసిన్‌ బయట ఉన్న తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్‌ కుడికాలువకు నాలుగు టీఎంసీలు ఇచ్చిందని, తెలంగాణకు అదనంగా రావాలసిన 324 టీఎంసీలు రాలేదంది. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు.. లేదా ఏపీ పునర్విభజన చట్టం పరిధిని మార్చడం కానీ చేయాలని కోరింది.

సెక్షన్‌-89 ప్రకారం రెండు అంశాలకే పరిమితం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-89 ప్రకారం గడువు పొడిగించిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ వాదనలు విన్న తర్వాత వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం తప్ప కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధం లేదని పేర్కొంది. కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకే అని పేర్కొంది. ఏయే అంశాలపై విచారిస్తామో కూడా ట్రైబ్యునల్‌ పేర్కొంది. తమ పరిధి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలన్న ప్రొటోకాల్‌ను నిర్ధారించడం వరకే అని స్పష్టం చేసింది.

ఈ ట్రైబ్యునల్‌ పరిధి పరిమితం అని నిర్ధారణకు వచ్చిన తెలంగాణ అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని 2018 ఆగస్టులో మరో లేఖ రాసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకు అన్యాయం జరిగిందని ఇందులో పేర్కొంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దటానికి చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం దీని ఆధారంగానే న్యాయసలహా తీసుకొనే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని సెక్షన్‌-3 ప్రకారం ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌కే అప్పగించవచ్చన్న అభిప్రాయం వస్తే దాని ప్రకారమే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండిః ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.