ETV Bharat / state

సేవ చేసే వారికి ఓటు వేయండి: తలసాని, గంగుల

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కష్టపడి ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తెరాస అభ్యర్థి సురభి వాణిదేవితో కలిసి సనత్​నగర్​లోని శ్యామలకుంట పార్కులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ministers talasani srinivas yadav, gangual kamalakar campaign in hyderabad
సేవ చేసే వారికి ఓటు వేయండి: మంత్రులు
author img

By

Published : Mar 4, 2021, 10:04 AM IST

హైదరాబాద్​ సనత్​నగర్​లోని శ్యామల కుంట పార్కులో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి ప్రచారం చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేసి గెలపించాలని తలసాని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందని విమర్శించారు. గత ఆరేళ్లుగా భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​ రావు ఏ ఒక్కరోజు ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు.

నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మధ్య ఉండే అభ్యర్థిని గెలిపించాలని గంగుల కమలాకర్ కోరారు. తెరాస అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తెలంగాణ బిడ్డగా తనను ఆదరించాలని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.

ఇదీ చదవండి: కొవిడ్​​ నుంచి కోలుకున్నా.. ఇతర సమస్యలతో అతలాకుతలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.