గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, పరిశ్రమ శాఖల సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆహారోత్పత్తుల తయారీ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రులు తెలిపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు పశుసంవర్థక శాఖ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు."పశుసంవర్థక, మత్స్య, పరిశ్రమ శాఖల పనితీరుపై, ఆయా శాఖలు కలిసి ఉమ్మడిగా పనిచేసే అంశాలపై అధికారులతో చర్చించారు.
వ్యవసాయం రంగం, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖలతో కలిసి పరిశ్రమల శాఖ పని చేయడం ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టవచ్చని మంత్రులు నిర్ణయించారు. పశుసంవర్ధక శాఖ కోసం మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సీఎం ప్రత్యేక చొరవ-దూరదృష్టి వల్ల ఇప్పటికే గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, అనేక కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ప్రేమ పేరుతో 200 మందిని ట్రాప్ చేశాడు..