జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో రోజూ.. దాదాపు 11 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేయాలని మంత్రులు కేటీఆర్, తలసాని జలమండలి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ..
నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, అంబర్పేట ఫ్లైఓవర్ పనుల వివరాలను అధికారులు అందించారు. అంబర్పేట ఫ్లై ఓవర్ పనుల ప్రారంభానికి అవసరమయిన భూసేకరణ దాదాపుగా పూర్తైంయిదని టౌన్ ప్లానింగ్ అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే అంశం పరిశీలనలో ఉంది'