ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రుల సమీక్ష - telangana varthalu

సీతాఫల్​మండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు తలసాని, గంగుల కమలాకర్​, ఉపసభాపతి పద్మారావు గౌడ్​ సమీక్ష నిర్వహించారు. తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రుల సమీక్ష

author img

By

Published : Mar 3, 2021, 8:27 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని, సికింద్రాబాద్ నుంచి మంచి ఆధిక్యత లభించేలా కృషి చేస్తామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సీతాఫల్​మండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, గంగుల కమలాకర్​లతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెరాస అభ్యర్థి సురభి వాణి దేవికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని గంగుల కమలాకర్​ అన్నారు.,

పార్టీ అభ్యర్థి వాణిదేవిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులు కావాలని తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కోరారు. సికింద్రాబాద్ పరిధిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసినట్లు పద్మారావు గౌడ్​ తెలిపారు.

ఇదీ చదవండి: కేటీఆర్ చేతుల మీదుగా జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.