హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సీపీలు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇళ్లలోనే గణేశ్ పండుగను జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
ఇళ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు జరుపుకోవాలన్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 80 వేల గణేశ్ ప్రతిమలు పంపిణీ చేస్తారని ఆయన వెల్లడించారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని అన్నారు.
ఇవీ చూడండి: వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష