ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

హైదరాబాద్ బషీర్ బాగ్​లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాఠోడ్​, ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​తో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

ktr
ktr
author img

By

Published : Oct 7, 2020, 4:34 PM IST

ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాఠోడ్​, ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​తో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరం ప్రారంభించారు. అనంతరం కమిషన్ వెబ్‌సైట్‌, బ్రోచర్‌తోపాటు పౌరహక్కుల దినోత్సవ ప్రతిజ్ఞ, పౌరహక్కుల దినోత్సవ పోస్టర్‌ ఆవిష్కరించారు.

డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన కమిషన్‌ చాలా గొప్పగా పనిచేస్తోందని మంత్రి కేటీఆర్​ ప్రశంసించారు. ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు ఏ విధంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ పని తీరే నిదర్శనమని పేర్కొన్నారు. 6,771 ఫిర్యాదులు స్వీకరించి... 92 శాతం కేసులు పరిష్కరించడం చాల గొప్ప విషయమన్నారు. 7,883 గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించడం చిన్న విషయం కాదని... బాధితులకు రూ.53 కోట్ల పరిహారం అందజేయడం దేశానికి ఆదర్శమన్నారు.

ఇదీ చదవండి : శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.