ETV Bharat / state

పరేడ్​ గ్రౌండ్స్​లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ -​ ప్రారంభించిన మంత్రులు జూపల్లి, పొన్నం - కైట్ ఫెస్టివల్

Ministers Jupally and Ponnam inaugurate Kite Festival : సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్​ను మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవంలో ఉచిత ప్రవేశం కల్పించినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 8:08 PM IST

Ministers Jupally and Ponnam inaugurates Kite Festival : మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకునేందుకు కైట్​ అండ్​ స్వీట్​ ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) పేర్కొన్నారు. సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి కైట్​ అండ్​ స్వీట్​ ఫెస్టివల్​ను ఆయన ప్రారంభించారు.

సంక్రాంతికి, గాలిపటానికి సంబంధం ఏంటీ? అసలెందుకు ఆరోజు పతంగులను ఎగరవేస్తారు?

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కైట్​ అండ్ స్వీట్​ ఫెస్టివల్​ జరుగుతోందన్నారు. ఈ ఉత్సవంలో 15 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. పరేడ్‌ గ్రౌండ్‌లో ఫుడ్‌ కోర్టులు, హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Kites and Sweets Festival At Hyderabad : సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. కరోనా కారణంగా 2021 నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్​ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది.

కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది : మంత్రి ఉత్తమ్‌ కుమార్

Congress Govt to Organize kites Ceremony at Hyderabad : ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగర పౌరులకు ఉచితంగా అవకాశాన్ని కల్పించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావాల్సిన వినోదంతో పాటు పసందైన రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, కొరియా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్ సహా 16 దేశల నుంచి నిపుణులైన అంతర్జాతీయ కైట్ ప్లేయర్ 40 మంది, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.

Kites and Sweets Festival 2024 : కైట్ ఫెస్టివల్​తో పాటు ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్ సందర్శకులకు నోరూరించనున్నాయి. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్ద తయారుచేసిన 400 రకాల మిఠాయిలతో పాటు పిండివంటలు, తెలంగాణ వంటకాలను ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నారు.

"పరేడ్​ గ్రౌండ్​లో మూడు రోజుల పాటు కైట్​ ఫెస్టివల్​ జరుగుతుంది. తెలంగాణ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి జరగడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. టూరిజం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలి". - జూపల్లి కృష్ణారావు, పర్యాటకశాఖ మంత్రి

కైట్​ ఫెస్టివల్​ ప్రారంభించిన మంత్రి జూపల్లి- రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పిలుపు

కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​తో సీఎం రేవంత్​ భేటీ - ధాన్యం సేకరణపై చర్చ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.