రాష్ట్ర ప్రజలకు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్లు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగను జరుపుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని... అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారన్నారు.
చిన్నపిల్లలు హోలీ ఆడేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా హోలీ పండగను సంతోషంగా జరుపుకోవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: మల్లన్న జాతరకు... యాభైవేల బోనాలు!