ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
సత్యవేడు ఎమ్మెల్యేకు..
చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఆయనకు లక్షణాలు బయటపడగా పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీచూడండి: ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు