ETV Bharat / state

న్యాక్​ రూపొందించిన వెబ్​సైట్​ను ప్రారంభించిన మంత్రి వేముల - ఉపాధి కల్పన

నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు న్యాక్​ రూపొందించిన వెబ్​సైట్​ను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో మానవ వనరుల అవసరం చాలా ఉందని మంత్రి పేర్కొన్నారు. యువతకు, కార్మికులకు ఉపాధి కల్పించడంలో న్యాక్​ ముఖ్య భూమిక పోషించాలని మంత్రి సూచించారు.

minister vemula prashanth reddy launched website for returned local labours in hyderabad
నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పనకై వెబ్​సైట్​ను ప్రారంభించిన మంత్రి
author img

By

Published : Jun 6, 2020, 10:37 PM IST

విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణానికి తిరిగి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన వెబ్​సైట్ ప్రారంభమైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​(న్యాక్) రూపొందించిన ఈ ప్రత్యేక వెబ్​సైట్​ను ఎర్రమంజిల్​లోని ఆర్​ అండ్​ బీ కార్యాలయంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు గల్ఫ్ దేశాలు, ముంబయి, సూరత్, తదితర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న దృష్ట్యా... వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రణాళికల్లో భాగంగా ఆవిష్కరించిన ఈ వెబ్​సైట్​లో కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని నిర్మాణ రంగ సంఘాల ద్వారా వారికి ఉపాధి లభించనుంది.

న్యాక్ ముఖ్య భూమిక పోషించాలి...

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో న్యాక్ ముఖ్య భూమిక పోషించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. నిరుద్యోగ యువతకు, కార్మికులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ నిర్మాణ రంగ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. తెలంగాణలో మానవ వనరుల అవసరం చాలా ఉందని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు తోడ్పడే నిర్మాణ రంగ సంస్థలకు సమన్వయంగా న్యాక్ ఉంటుందని, త్వరలోనే యాప్​ను రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, న్యాక్ డీజీ భిక్షపతి, అధికారులు, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ప్రైవేటు'లో కరోనా చికిత్స ఫీజుపై పరిమితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.