Minister Uttam Kumar Reddy Order Inquiry Into Kaleshwaram Project : మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి పారుదల శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జలసౌధలో నీటి పారుదల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ శాఖపై మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను ఈఎన్సీ మురళీధర్‌రావు వివరించారు.
మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశామని, ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిపోయిందని ఇంజినీర్లు తెలిపారు. దీంతో మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని వారు చెప్పారు. ఇలా మొత్తం నాలుగు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందన్నారు. పిల్లర్లు కింగిన ముందు రోజు వెంటనే ప్రాజెక్టులోని నీటిని తీసేయమని చెప్పారు. ఇలా చేయడం వల్ల కుంగడం తగ్గిందన్నారు.
పార్టీకి నమ్మిన బంటు, ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే
"40 వేల చెరువు నిర్వహణ గురించి మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నామమాత్రంగా కట్టారు. అక్కడ ఖర్చు చేసింది ఎంత, ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు నిర్మాణం జరిగింది. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత? సొరంగం పనులపై ఎంత అమౌంట్ ఉంటే అంత మనీ కోసం ముఖ్యమంత్రి దగ్గర కేబినెట్లో ఆమోదం తీసుకొని ఆ పనులు వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తాను. చుట్టు పక్కల రాష్ట్రాలతో స్నేహభావంతో ముందుకు సాగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాం." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
Uttam Kumar Reddy Review Irrigation Department : రాష్ట్రంలో నీటిపారుదల శాఖది చాలా కీలకమని పూర్తి వివరాలు రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత నది(Pranahitha River) వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని ఆయన చెప్పారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎల్బీసీ సొరంగం పనులు పూర్తయ్యేందుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ : అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై విచారణకు ఆదేశిస్తామని, నీటి వాటా కోసం కేంద్రంతో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. 40 వేల చెరువుల నిర్వహణ గురించి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందన్నారు. ప్రజల డబ్బుతో జరిగే పనుల్లో గోప్యత ఉండకూడదని, అందుకే వాటి అన్నింటిపై విచారణ చేస్తామన్నారు. అందుకు తగిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీటితో పాటు కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారును ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల శాఖది కీలక పాత్రనని కొనియాడారు.
Medigadda Barrage in Bhupalpally : "మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు.. కానీ?"