Minister Uttam Kumar Reddy on One Month Ruling in Telangana : నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామని, నీటి పారుదల శాఖలో జవాబుదారీతనంతో పారదర్శకంగా పని చేస్తున్నామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నెల రోజుల ప్రభుత్వ పాలనపై మంత్రి ఉత్తమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారని, ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్
Minister Uttam Kumar Reddy Explain Medigadda Issue : తెలంగాణ ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలో అనేక సమీక్షలు చేశామని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం తదితర అంశాలలో సమీక్ష చేశామని వివరించారు. జ్యుడీషియల్ విచారణ(Judicial inquiry on Medigadda Barae) కోసం ఒక సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరామన్నారు. మేడిగడ్డ కూలిపోవడంపై, కాళేశ్వరంపై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలియజేశామని స్పష్టం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Changes of Irrigation Department in Telangana in One Month : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సాగు నీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టామన్నారు. పౌర సరఫరా శాఖలో రూ.58 వేల కోట్ల అప్పులు పేరుకుపోయాయని, పేదలకు ఇస్తున్న బియ్యం కిలో రూ.38 ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పని చేస్తామని హామీ ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నెల రోజుల పాలనపై తన అధికార ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారు : పొంగులేటి