ETV Bharat / state

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్​మెన్ వీరంగం - కుమార్తెపై దాడి చేసిన తానేటి వనిత గన్​మెన్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మంత్రి తానేటి వనిత గన్​మెన్ చంద్రారావు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో దాడి చేశాడు.

daughter love
కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్​మెన్ వీరంగం
author img

By

Published : Jun 23, 2020, 3:59 PM IST

తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఆంధ్రప్రదేశ్​కు చెందిన మంత్రి తానేటి వనిత గన్​మెన్ చంద్రారావు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో కుమార్తె గాయత్రి, అల్లుడు కిరీటిపై దాడి చేశాడు.

ఐదు నెలల కిందట తానేటి వనిత గన్​మెన్ చంద్రారావు కుమార్తె గాయత్రి, కిరీటీ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి చంద్రారావు వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దాడి చేశాడు. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లగా.. చంద్రారావుపై కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ.. ఈ జంటపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొవ్వూరు మండలంలో గ్రామ సచివాలయంలో పని చేస్తున్న తనను... చంద్రారావు పరపతి ఉపయోగించి.. ఏలూరుకు బదిలీ చేయించినట్లు గాయత్రి ఆరోపిస్తోంది. తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కావాలని కోరుతోంది.

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రి గన్​మెన్ వీరంగం

ఇదీ చూడండి: ఆర్మీ జవాన్​ తల్లిపై దౌర్జన్యం.. భూమి తనదేనంటూ దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.