తెరాసకు కార్యకర్తలే పట్టుకోమ్మలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని పాటిగడ్డలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల బీమా అందించి... వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ... దేశానికే ఆదర్శంగా నిలిచిందని తలసాని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్ అమలవుతోందన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సాయాన్ని తెరాస ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. తాగునీరు, డ్రైనేజి, రోడ్లు, వంటి అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదులో సనత్నగర్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని కార్యకర్తలను కోరారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్కు పుట్టినరోజు బహుమతి ఏమిటంటే..?