రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం పశు సంవర్ధక శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేసే యోచనలో భాగంగా పశువులు కలిగిన రైతులు, పశు వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
9121213220 నంబరుకు ఫోన్ చేసి తక్షణ సూచనలు పొందవచ్చని తెలిపారు. రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఇదీ చదవండి: మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం