రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఆర్థిక సాయం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయానికి సంబంధించి సభ్యులు చల్లా ధర్మారెడ్డి, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, గువ్వల బాలరాజు సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఖరీఫ్‌లో రైతు బంధుకు 7వేల 254 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు 4వేల 380 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. ఇంకా 13 లక్షల 18 వేల మంది రైతులకు ఆర్థిక సాయం అందాల్సి ఉందన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. త్వరలోనే వారికి అందుతుందని భరోసా ఇచ్చారు. అటవీ భూములు, పట్టా దారు పాసుపుస్తకాల సమస్యలు ఉన్న రైతులకు సాయం అందలేదన్న సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్