గోల్కొండ జగదాంబికా మహంకాళి ఆషాడబోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఘటాల ఊరేగింపు, బోనాల సందర్భంగా ప్రతి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం రోడ్ల మరమ్మతులు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఫ్లడ్‌లైట్లు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్ల పనులను సకాలంలో పూర్తి చేశామన్నారు. వైద్యశిబిరాలు, అంబులెన్స్, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిభింబిచేలా కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనుల కోసం అదనపు సిబ్బంది, జనరేటర్లు అందుబాటులో ఉంచామని, బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: వైభవంగా గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలు