శాసనసభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు గుర్తుకువస్తాయని భట్టి విమర్శించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. భట్టి ఇంటికి వెళ్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి చెబుతానని మంత్రి తలసాని పేర్కొన్నారు. అన్నట్లుగానే.. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి తలసాని వెళ్లారు.
మంత్రి బృందానికి భట్టి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయో తలసాని వివరించారు. వాటిని చూపించేందుకు భట్టిని తన కారులో మంత్రి తలసాని తీసుకెళ్లారు.
ఇదీ చదవండి : తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్