ETV Bharat / state

ఎర్రగడ్డలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం: మంత్రి తలసాని - telangana varthalu

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ఆవరణలో 'మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి' నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. త్వరలోనే సీఎంకు సమగ్ర నివేదిక అందజేస్తామని వెల్లడించారు.

minister talasani
ఎర్రగడ్డలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
author img

By

Published : Jun 8, 2021, 4:45 PM IST

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ఆవరణలో.. "మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. త్వరలోనే ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ, సంబంధిత అధికారులతో కలిసి చెస్ట్ ఆసుపత్రి సందర్శించిన అనంతరం.. సీఎంకు సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల చెస్ట్ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకునేందుకు హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సందర్శించిన సమయంలో.... మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రాధాన్యత సీఎంకి వివరించినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ మేరకు మాసబ్‌ట్యాంకు పశుభవన్‌లోని తన కార్యాలయంలో చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్‌తో చెస్ట్ ఆసుపత్రి విస్తీర్ణం, ఆధునిక హంగులతో నిర్మాణాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌, ఖైరతాబాద్ నియోజకవర్గాల ప్రజలకు అతి చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీచూడండి: Eatala : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.