ETV Bharat / state

TALASANI: 'మత్స్యకారుల సంక్షేమం కోసం సర్కారు కృషి చేస్తోంది'

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యల పరిష్కారానికి జులై 8వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మాసబ్​ట్యాంక్​లోని కార్యాలయంలో మత్స్య శాఖ కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు.

minister talasani
TALASANI: 'మత్స్యకారుల సంక్షేమం కోసం సర్కారు కృషి చేస్తోంది'
author img

By

Published : Jun 22, 2021, 5:18 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ మత్స్య రంగం అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. ఈ ఏడాది వానాకాలం ఆరంభమైన తరుణంలో హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని పశుభవన్‌లో గల తన కార్యాలయంలో మత్స్య శాఖ కార్యకలాపాలపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇతర మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్న తరుణంలో మత్స్యకారుల జీవనోపాధి గణనీయంగా మెరుగుపడిందని మంత్రి తెలిపారు.

సమస్యల పరిష్కారం కోసం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించే అంశం, దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యల పరిష్కారానికి జులై 8వ తేదీన గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కొత్త జిల్లాల ఆవిర్భావం నేపథ్యంలో నూతన గ్రామ పంచాయితీలు ఏర్పడిన దృష్ట్యా ఆ ఆధారంగా అదనంగా మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు.

పెండింగ్​ నిధులపై స్పష్టత

మృతి చెందిన 116 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున బీమా కింద చెల్లించాల్సిన పెండింగ్ నిధులు త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. గ్రామ పంచాయతీ చెరువుల లీజు అంశం, ఇతర విషయాలపై ఎంపీ బండ ప్రకాష్ ప్రస్తావించగా... అవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరణించిన మత్స్యకారులకు 6 లక్షల రూపాయలు బీమా సొమ్ము చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని... అందుకు అనుగుణంగా నూతన విధివిధానాలు రూపొందించాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.

ఇదీల చదవండి: MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.