ETV Bharat / state

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి 2.5 కిలోల బంగారంతో బోనం - మంత్రి తలసాని తాజా వార్తలు

Balkampeta: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5న నిర్వహించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో అమ్మవారి కల్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

minister talasani
మంత్రి తలసాని
author img

By

Published : Mar 31, 2022, 5:05 PM IST

Balkampeta: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తన కార్యాలయంలో అమ్మవారి కల్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5న నిర్వహించినున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన 2.5 కిలోల బంగారంతో బోనం తయారు చేయించనున్నట్లు పేర్కొన్నారు. దేవాలయంలో ప్రస్తుతం ఉన్న రుద్రాక్ష మండపం చెక్క పై వెండి తొడుగులతో ఉన్నదని.. దాని స్థానంలో నూతనంగా రాతి రుద్రాక్ష మండపము ఏర్పాటు చేసి బంగారు తాపడము చేయించాలన్నారు .

ఆలయంలోని పోచమ్మ, నాగదేవత అమ్మవారి ఆలయ తలుపులకు వెండి తాపడం చేయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్ధం బోనం కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో జీ ప్లస్ 3 పద్దతిలో వాహనాల పార్కింగ్ సముదాయం నిర్మించనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: School Fee regulation meet: 'ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.