సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాంగోపాల్‌పేటకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.లక్షా 98 వేల రూపాయల విలువ గల చెక్కులను రాంగోపాల్ పేట కార్పొరేటర్ అరుణ గౌడ్‌తో కలిసి మంత్రి తలసాని లబ్ధిదారులకు అందజేశారు. ఆర్ధిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్న రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి తలసాని
సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. బాధితులకు వైద్య చికిత్స నిమిత్తం అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు.