ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కొవిడ్(covid) నియంత్రణలో ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) స్పష్టం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని వ్యాక్సినేషన్(vaccination) కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. సనత్‌నగర్‌లో వ్యాక్సినేషన్ శాతం తక్కువగా ఉందని అన్నారు. టోకెన్లు తీసుకున్న వారిలో తక్కువ మంది టీకాలు వేయించుకోవడంపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా ఉన్న సమస్యలపై మంత్రి ఆరా తీశారు. టీకా కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ఆశా వర్కర్లకు ఏమైనా సమస్యలుంటే కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తలసాని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ ప్రవీణ్‌తో పాటు స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Sonu Sood : మంత్రి కేటీఆర్ అసలైన హీరో: సోనూ సూద్