పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలాలను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామహల్లో ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొని... ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
"దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అందుకే పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడకు వలస వస్తున్నారు. వీరిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయం. వీరు సేవలు ఇలాగే కొనసాగించాలి."
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇవీ చూడండి: ఏపీలో 2018కి చేరిన కరోనా కేసుల సంఖ్య