సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జరుగుతున్న కోటి కుంకుమార్చన ఉత్సవాల ముగింపు పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఇక్కడ నిర్వహించిన పూర్ణాహుతి హోమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అన్నపూర్ణ, స్థానిక కార్పొరేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'న్యాయ విచారణ కమిషన్ ఉన్నందున ఇప్పుడేం విచారించలేం'