ETV Bharat / state

Balkampet Yellamma: 'అమ్మవారి కల్యాణానికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు' - బల్కంపేట ఏర్పాట్లపై మంత్రి తలసాని

Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్​లోని మాసాబ్​ ట్యాంక్​లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Talasani On Balkampet
తలసాని
author img

By

Published : Jun 7, 2022, 4:12 PM IST

Balkampet Yellamma: వచ్చే నెలలో జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ వెల్లడించారు. జూలై 5న అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై మాసాబ్​ ట్యాంక్​లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 4న ఎదుర్కోలు, 5న కల్యాణం, 6న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సీసీ కెమెరాలతో భద్రత: అమ్మవారి కల్యాణానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా.. ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోనాల పండుగలో ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నట్లు వివరించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడ కూడా సీవరేజి లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్ వర్స్క్​ అధికారులను మంత్రి ఆదేశించారు.

బార్​ కోడింగ్​తో పాసులు జారీ: రహదారుల మరమ్మతులు ఎక్కడైనా ఉంటే ఇప్పటి నుంచే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అమ్మవారి రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా విద్యుత్ లైన్లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించడం చేపట్టాలన్నారు. అమ్మవారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాసులను నకిలీకి ఆస్కారం లేకుండా బార్ కోడింగ్​తో కూడిన పాసులను జారీ చేయాలని ఆదేశించారు. ఆలయం వైపునకు వచ్చే రహదారులను మూసివేసి వాహనాల మళ్లింపు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో భక్తులను ఆహ్లాద పరిచేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని చెప్పారు. ఆలయంలో ప్రభుత్వం, దాతల సహకారంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: నిరుద్యోగులకు మరో గుడ్​న్యూస్​.. 1,433 కొత్త ఉద్యోగాల భర్తీకి అనుమతి

నుపుర్​ శర్మకు 'మహా' పోలీసుల సమన్లు- దిల్లీ పోలీసుల భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.