హైదరాబాద్లోని బషీర్ బాగ్ పూల్ బాగ్ బస్తీలో జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూల్ మిషన్ కింద నిర్మించిన ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్, జీహెచ్ఎంసీ హౌసింగ్ బోర్డ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. 608 గృహాలను నిర్మించామని తెలిపారు. మరో 15 రోజుల్లోగా లబ్ధిదారులకి భవనాల్ని కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం గన్ ఫౌండ్రి, గౌలిగూడలో బస్తీ దవాఖానలను మంత్రి ప్రారంభించారు.
ఇదీ చూడండి :కుటుంబ సభ్యులతో మెట్రోలో ప్రయాణించిన గవర్నర్