కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్ష పదవికి తెరాస పార్టీ అభ్యర్థిగా జక్కుల మహేశ్వర్ రెడ్డిని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించారు. ఈ మేరకు శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి కంటోన్మెంట్ బోర్డు సభ్యులు సదాకేశవ రెడ్డి, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, పాండు యాదవ్, అనిత ప్రభాకర్, భాగ్యశ్యాం, లోకనాథం, నలిని కిరణ్‌లతో సమావేశం నిర్వహించారు.
బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణపై కమిటీ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గడం వల్ల రామకృష్ణ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యక్ష పదవికి జక్కుల మహేశ్వర్ రెడ్డి పేరును మంత్రి తలసాని ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస ఇంఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలోనే జలవిప్లవాన్ని సాధించాం: వినోద్‌కుమార్