2020 సంవత్సరం ప్రపంచానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతన ఏడాదిలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ బయటపడాలని ఆకాంక్షించారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్, మహంకాళి ఆలయం ఈవో మనోహర్‌రెడ్డి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, బేగంపేట ఏసీపీ వినోద్, రాంగోపాలపేట ఏపీపీ, ఎస్ఆర్నగర్ ఇన్స్‌స్పెక్టర్ సైదులు.. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీచూడండి: మద్యం మానేద్దాం.. 2021ని హాయిగా గడిపేద్దాం!