వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోకపోవడం బాధాకరమన్నారు. వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకునేలా గణనాథుడి ఆశీర్వాదం ఉండాలని పేర్కొన్నారు.
గణేష్ ఉత్సవాలు విషయంలో భాజపా నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పండుగలు నిర్వహించింని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు రక్షించుకోవడం ముఖ్యమని వెల్లడించారు. భాజపా నాయకులు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి: 'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'