హైదరాబాద్ చైతన్యపురి డివిజన్‌లో నివసిస్తున్న 500మంది పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి నిత్యావసరాలను సమకూర్చారు. భౌతికదూరం పాటిస్తూ సరుకులను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న కార్పొరేటర్‌కు కాలనీ పేదలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'