రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ చైతన్యపురిలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్లోని యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.
అనంతరం జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ప్రభాత్నగర్ కాలనీలో మొక్కలు నాటి, అనాథ పిల్లలకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: చపాతీలో మత్తు కలిపారు.. ఉన్నదంతా దోచేశారు