సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర భవిష్యవాణి కార్యక్రమంలో చెప్పిన విధంగా ఐదు వారాల పాటు అమ్మవారికి సాకల కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి వారం తొలి సాకను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిష్యవాణి ఆదేశాల మేరకు అమ్మవారి కటాక్షం కలగాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అత్తిలి అరుణ, ఆలయ ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : లాల్‌దర్వాజలో బోనాలు సమర్పించిన మంత్రులు