కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ, సంగీత నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా వల్ల అనేక రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని మంత్రి ఆందోళన చెందారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కట్టడికి పాటుపడాలని ఓ ప్రకటనలో మంత్రి తెలిపారు. తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారినపడకుండా రక్షించుకోవచ్చని సూచించారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరగా భారతదేశం నుంచి తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తలసాని ఆకాంక్షించారు.
ఇవీచూడండి: ప్రగతిభవన్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్