హైదరాబాద్ నగరంలో స్థలాలు లేకపోవడం వల్లే శివార్లలో నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక్కడ కట్టే ఇళ్లల్లో 90 శాతం జీహెచ్ఎంసీ పరిధి ప్రజలకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించిన లిస్ట్ ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్లు పారిపోతున్నారని విమర్శించారు.
హైదరాబాద్లో భట్టి స్థలాలు చూపిస్తే అక్కడ ఇళ్లు కట్టించే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. గాంధీ భవన్కు వెళ్లి ఇష్టమున్నట్లు మాట్లాడుకోవచ్చని సూచించారు. లక్ష ఇళ్లకు సంబంధించి జాబితా ఇస్తామని.. దాని ప్రకారం వాళ్లే తిరిగి చూసుకోవచ్చన్నారు.
ఇదీ చదవండి : ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్