ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ను అధిగమించాలంటే ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ... ఇళ్లలోనే ఉండలన్నారు మంత్రి తలసాని. హైదరాబాద్లోని నాచారం డివిజన్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు మంత్రి తలసాని, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రతి క్షణం అందరినీ అప్రమత్తం చేస్తూ.... పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చేస్తున్నారని... అందరూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.
'ప్రభుత్వానికి సహకరించండి... కరోనాను తరిమికొట్టండి'
హైదరాబాద్లోని నాచారం డివిజన్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు, నిరుపేదలకు మంత్రి తలసాని, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.