తెలంగాణ మాదిగల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మాన్యశ్రీ కాన్షీరామ్ 86వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యాక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. జాతి హక్కుల కోసం పోరాడిన మహానీయ వ్యక్తిగా కాన్షీరామ్ ఎదిగిరాని మంత్రి పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
సైకిల్ యాత్ర ద్వారా యావత్ దేశాన్ని కదిలించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అంబేద్కర్, కాన్షీరామ్ వంటి మహనీయుల ఆదర్శలను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్