కుల వివక్షకు వ్యతిరేకంగా.. సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన 195వ జయంతిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
దేశానికి, సమాజానికి పూలే అందించిన సేవలను మరువలేనివని మంత్రి కొనియాడారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం, బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఆచరించిన కార్యచరణ మహోన్నతమైనదన్నారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా విద్యా, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని తెలిపారు. ఆయన ఆలోచన విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి: జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించిన కలెక్టర్