రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేడియాలను క్రీడల కోసమే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. క్రీడాశాఖ ఆదాయ వనరులు పెంచుకునేందుకు కృషి చేయాలని... ఆశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. క్రీడా వసతి గృహాల్లో వసతులు పెంచుతూ.. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
స్టేడియాల అభివృద్ధితో పాటు, మరమ్మతులు శరవేగంగా పూర్తి చేయాలన్నాని సూచించారు. క్రీడా ప్రాంగణాలను పీపీపీ విధానంలో ఆధునీకరించి ఆదాయ వనరులుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తెలిపారు.