ప్రజలకు ఆరోగ్యకరమైన పానీయం అందుబాటులోకి తెచ్చేందుకే 'నీరా' స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. గీత వృత్తిని నమ్ముకుని ఎందరో ప్రాణాలు పొగొట్టుకోవాల్సి వచ్చిందని.. అయినా కుల వృత్తిని వదులుకోకుండా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారన్నారు. గురువారం హుస్సేన్ సాగర్ ఒడ్డున మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న నీర స్టాల్ శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా నీరా స్టాల్ ఎలా నిర్మాణం జరుగుతుందో.. దానికి చెందిన నమూనాను మీడియాకు విడుదల చేశారు. పది రకాల వృత్తులకు మేలు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం చేయూత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. 15 రకాల ఔషద గుణాలు కలిగిన నీరాను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం కేటీఆర్ చేతుల మీదుగా నీరా స్టాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాలుగైదు నెలల్లో నీరా స్టాల్ నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?